అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో అక్రమంగా మద్యం కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను ఎస్ఐ శిరీష అదుపులోకి తీసుకున్నారు. మండల పరిధిలోని ఇరాలి, వేటపాలెం గ్రామాలకు చెందిన ఇరువురు వ్యక్తుల నుంచి 24 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.