ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం ఒక రెస్టారెంట్ ప్రారంభం సందర్భంగా వినూత్న ఆఫర్ పెట్టారు. మూడు రూపాయలకు. బిర్యానీ అని ప్రకటించడంతో ప్రజలు భారీగా రెస్టారెంట్ వద్దకు తరలివచ్చారు. దీంతో నిర్వాహకులు క్యూలైన్ పెట్టి మూడు రూపాయలకు బిర్యానీ అందజేస్తున్నారు. అలాగే పలువురు నిరాశతో వెను తిరుగుతున్నారు.