అన్న క్యాంటీన్లను కేవలం నగర, పట్టణ ప్రాంతాలలో మాత్రమే కాకుండా మండల కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని సామాజిక వేత్తలు ఎల్ఎస్ భాస్కరరావు, టి. అప్పారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మండవల్లి లో వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోనే పేదలు ఎక్కువగా ఉంటారని, ప్రారంభంలో గ్రామాల్లో ఏర్పాటు చేయలేకపోయినా కనీసం మండల కేంద్రాల్లో అయినా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్నారు.