గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఆర్. సతీష్ డాక్టరేట్ పొందినందుకు నరసాపుర సూర్య కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గంటసాల బ్రహ్మాజీ అభినందనలు తెలిపారు. నరసాపురంలో సోమవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో డాక్టర్ ఎన్. వి. కృష్ణారావు మార్గదర్శకత్వంలో రచయిత మహీధర రామ్మోహన్ రావు సాహిత్యంలో సామ్యవాద స్పృహ అనే అంశంపై పీహెచ్ డి అందుకోవడం అభినందనీయమన్నారు.