పరిమెళ్ళ సిపిడబ్ల్యుఎస్ పైపులైన్ ల మరమ్మత్తులను త్వరితగతిన పూర్తిచేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. మంగళవారం కె.పెంటపాడు పరిమెళ్ళ వద్ద పంపింగ్ స్కీం పనితీరును పరిశీలించి, గ్రామాల ఎస్‌ఎస్ ట్యాంకుల వద్ద నీటి సరఫరా మ్యాపులను పరిశీలించి అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.