పమిడిముక్కల సిఐగా వై. చిట్టిబాబు శనివారంపదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పమిడిముక్కల సర్కిల్ పరిధిలో ఎవరైనా సంఘ విద్రోహకర చర్యలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే గంజాయి లాంటి ఇతర మత్తు పదార్థాలను విక్రయించిన కొనుగోలు చేసిన వారిపై ఉక్కు పాదం మోపడం జరుగుతుందని హెచ్చరించారు.