జిల్లా ఎస్పీ ఆదేశాలతో ముమ్మరంగా వాహనాల తనిఖీలు
కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఆదివారం రాత్రి ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. అవనిగడ్డ, గన్నవరం, మచిలీపట్నం, పెనమలూరు, పామర్రు, గుడివాడ, పెడన నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అదేవిధంగా ప్రధాన నాయకులు సంబంధించిన ఏటీఎం సెంటర్ల వద్ద పోలీస్ సిబ్బందిచే గస్తీ ముమ్మరం చేశారు. పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు.