అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ కి జైలు, జరిమానా
ఉయ్యూరు సివిల్ కోర్టు న్యాయమూర్తి కె. శ్రీహరి చెక్ బౌన్స్ కేసులో కానిస్టేబుల్ కి మంగళవారం జైలు, జరిమానా విధించారు. అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ గా పని చేస్తున్న బత్తుల రవికుమార్ లక్కింశెట్టి అనురాధ, రాఘవేంద్రరావుల వద్ద అప్పులు చేసి ఐదు లక్షలు చొప్పున రెండు బ్యాంకు చెక్కులు ఇవ్వగా వాటిని బ్యాంకులో జమ చేయగా అవి బౌన్స్ అయిన కారణంగా ఉయ్యూరు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసులు ఫైల్ చేశారు.