సంక్షేమ పధకాల పై ప్రజల్లో అవగాహనకు విస్తృత ప్రచారం చేయాలి
అభివృద్ధి సంక్షేమ పధకాలపై ప్రజల్లో అవగాహనకు ప్రచారం చేయాలని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. శుక్రవారం తాడిగడపలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సమాచారశాఖ క్షేత్రాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ణానాన్ని అలవర్చుకుని మరింత వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించు కోవాల్సిన అవసరం ఉందన్నారు.