జీలుగుమిల్లి: అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు దగ్ధం

73చూసినవారు
జీలుగుమిల్లి: అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు దగ్ధం
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనిలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కోర్స రమేష్ అనే వ్యక్తికి చెందిన తాటాకిల్లు దగ్ధం అయింది. తాటాకింట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో చుట్టూ పక్కల స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే నివాసం పూర్తిగా అగ్నికి ఆహుతయింది. కాగా అగ్ని ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్