యువతను సన్మార్గంలో నడిపించేందుకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ అన్నారు. గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం తాడేపల్లిగూడెం వాకర్స్ అసోసియేషన్ భవనం సమీపంలోని ఎంసీజీ గ్రౌండ్ లో రెండవ రోజు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా సంక్రాంతి జరుపుకోవాలన్నారు.