ఉద్యోగులకు బదిలీలు సర్వ సాధారణమని, విధి నిర్వహణలో అందించిన సేవలే గుర్తుంటాయని ఎంపిడిఓ ఎం. విశ్వనాథ్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శులకు, జూనియర్ అసిస్టెంట్ భరత్ ను సన్మానించారు. బదిలీపై వెళ్తున్న సిబ్బంది అందించిన సేవలను వివరించారు. జడ్పీటీసీ ఆంజనేయులు, ఈవోఆర్డీ వెంకటేష్, పంచాయతీ ఈవోలు శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మం, చంద్రరాజు పాల్గొన్నారు.