దళితులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ అన్నారు. కాళ్ల మండలం మేకలదిబ్బ గ్రామంలో మంగళవారం పంచాయతీ స్థలంలో దళితులను నడవకుండా ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళ అడ్డుకుంటున్న నేపథ్యంలో ఆయన గ్రామాన్ని సందర్శించారు. అనంతరం గ్రామ సర్పంచ్ ధర్మరాజు, ఎస్సై శ్రీనివాస్ సమక్షంలో ఇరువర్గాల మధ్య గొడవ లేకుండా చూడాలని కోరారు.