ఉండి మండలం కోలమూరు సంతాన గోపాలస్వామి ఆలయ ఆధ్వర్యంలో నేటి నుంచి 23వరకు సురభి పౌరాణిక, ఆధ్యాత్మిక పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తున్నట్లు ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు నంబూరి బదిరీ నారాయణ ఆదివారం తెలిపారు. 20న మాయాబజార్, 21న శ్రీకృష్ణ లీలలు, 22న లవకుశ, 23న శ్రీనివాస కల్యాణం నాటకాలు ప్రదర్శిస్తున్నట్లు వారు తెలిపారు. కావున ప్రజలు పెద్ద ఎత్తున ఈ నాటకాలను వీక్షించి ఆదరించాలన్నారు.