ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నూతన మద్యం దుకాణాలు ఏర్పాటుకు సంబంధించి టెండర్ల దాఖలు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఈ క్రమంలో గురువారం ఏలూరు జిల్లాలో మద్యం దుకాణాలకు చింతలపూడిలో 16, కైకలూరులో 7, నూజివీడు 8, ఏలూరు 1 దరఖాస్తు మాత్రమే దాఖలయ్యాయి. ప. గో. జిల్లా తణుకులో 2 దరఖాస్తులు వేసినట్టు అధికారులు తెలిపారు. ఏలూరు, దెందులూరు, పోలవరం, నూజివీడు, ఉంగుటూరు తదితర ప్రాంతాల్లో ఒక దరఖాస్తు కూడా పడలేదన్నారు.