రైతుల బలవన్మరణం.. ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షలు: మంత్రి అచ్చెన్న

60చూసినవారు
రైతుల బలవన్మరణం.. ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షలు: మంత్రి అచ్చెన్న
AP: 2024 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 39 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. బలవన్మరణానికి పాల్పడిన రైతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నామని తెలిపారు. 2024 జూన్‌కు ముందు 103 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ఇందులో 49 మంది రైతుల కుటుంబాలకు రూ.3.43 కోట్లు విడుదల చేశామన్నారు. 32 ఆత్మహత్యల కేసులకు రూ.2.24 కోట్లను త్వరలో విడుదల చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్