ఐపీఎల్ - 2025 సీజన్ ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. హైదరాబాద్‌లో జరిగే మొదటి రెండు మ్యాచ్‌ల టిక్కెట్లు మార్చి 7వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. రెండు టిక్కెట్లు కొనుగోలు చేస్తే ఒక జెర్సీని ఉచితంగా ఇస్తామని కూడా వెల్లడించారు. కాగా, మార్చి 23న SRH & RR, 27న SRH & LSG మధ్య మ్యాచ్ జరగనుంది.