జిల్లాల వరకే ఉచిత బస్సు ప్రయాణం: మంత్రి సంధ్యారాణి

83చూసినవారు
జిల్లాల వరకే ఉచిత బస్సు ప్రయాణం: మంత్రి సంధ్యారాణి
AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచలన ప్రకటన చేశారు. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వరకే పరిమితమని తెలిపారు. ఉచిత బస్సు పథకంపై మండలిలో వైసీపీ సభ్యుడు పీవీ సూర్యనారాయణరాజు ప్రశ్నించారు. దీనిపై మంత్రి సంధ్యారాణి స్పందించారు. ఏ జిల్లాల్లోని మహిళలకు, ఆ జిల్లాల్లోనే ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించామన్నారు. కాగా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆర్టీసీ ఉచిత ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్