ముంబయిలోని ఓ హోటల్‌లో నిశాంత్ త్రిపాఠి అనే వ్యక్తి రూం బుక్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికీ రూం నుంచి బయటకు రాకపోవడంతో సిబ్బంది డోర్ ఓపెన్ చేయగా.. అతడు విగతజీవిగా పడి ఉన్నాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. అతడి కంపెనీ వెబ్‌సైట్‌లో తన చావుకు కారణం భార్య అపూర్వ పరేఖ్, ఆమె బంధువు ప్రార్థన మిశ్రా అని లెటర్ దర్శనమిచ్చిందన్నారు.