TG: లగచర్లలో ఫార్మావిలేజ్‌ల ఏర్పాటు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో వెనకు తీసుకున్నది. మల్టీపర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీని కోసం లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, రోటిబండతండా, పులిచెర్లకుంట తండాల్లో 1,177.35 ఎకరాలు సేకరించేలా 2024 నవంబర్ 29న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 534 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, మిగతా 643 ఎకరాలు పట్టా భూమి.