తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువళ్లూరు సమీపంలో లారీని కారు ఢీ కొన్న ఘటనలో ఏపీలోని ఒంగోలుకు చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను నితీశ్ వర్మ, చేతన్‌రామ్, యుకేష్, నితీశ్, చైతన్య విష్ణుగా గుర్తించారు. వీళ్లంతా ఒంగోలులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. శనివారం ఒంగోలు నుంచి తిరువళ్లూరు వెళ్లి.. ఇవాళ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.