నంద్యాల జిల్లా వేంకటేశ్వరపురంలోని ఒక ప్రైవేట్ స్కూల్/జూనియర్ కాలేజీలోని విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. సుమారు 100 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వీరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం చికిత్స అందిస్తోంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు.