జనసేనలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు!

74చూసినవారు
జనసేనలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు!
AP: పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు శుక్రవారం జనసేనలో చేరనున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. దొరబాబుతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, పిఠాపురం జడ్పీటీసీ సభ్యుడు బుర్రా అనుబాబు, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, పిఠాపురం పురపాలక సంఘం వైస్ చైర్మన్ కొత్తపల్లి పద్మ బుజ్జి తదితరులు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.

సంబంధిత పోస్ట్