ఒడిశా పారదీప్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జగత్‌సింగ్ పూర్ ఫిషింగ్ పోర్టులోని జెట్టీ నెంబర్1లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో పదికి పైగా మత్స్యకారుల బోట్లు మంటల్లో దగ్ధమయ్యాయి. బోట్లలో ప్లాస్టిక్ వస్తువులు, టైర్లు ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.