పెదకూరపాడులో ఆక్రమణలను తొలగిస్తాం
పెదకూరపాడు మండలంలో ఆక్రమణలు తొలగిస్తామని పెదకూరపాడు మండల ఈవోపీఆర్డీ శరత్ బాబు అన్నారు. మండల బాధ్యతలు తీసుకున్న సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఆక్రమణలు ఉంటే సహించేది లేదన్నారు. ఆక్రమించుకున్న వారు స్వచ్ఛందంగా తొలగిస్తే మంచిదన్నారు. లేని పక్షంలో నోటీసులు ఇచ్చి మేమే తొలగిస్తామని హెచ్చరించారు.