బాపట్ల: ఎస్పీ స్పందనకు 50 అర్జీలు

77చూసినవారు
బాపట్ల: ఎస్పీ స్పందనకు 50 అర్జీలు
బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం అడిషనల్ ఎస్పీ టి. పి. విఠలేశ్వర్ "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల యొక్క వ్రాతపూర్వక అర్జీలను స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి చట్టపరిధిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కార్యక్రమానికి 50 అర్జీలు అందాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్