రాష్ట సీఎం నారా చంద్రబాబు నాయుడు 7వ తేదీన బాపట్ల జిల్లా పర్యటన ఖరారైన నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ వెంకట మురళి, సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ జడ్పీ పాఠశాల గ్రౌండ్ ను పరిశీలించారు. అనంతరం అధికారులు, ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఆహ్వానం, డెకరేషన్ ఏర్పాట్లు, సంస్కృతిక కార్యక్రమాలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అధికారులందరూ సమన్వయంతో సీఎం పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.