రోడ్లపై ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై వాహన చోదకులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ జె. వెంకట మురళి పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రతా మసోత్సవాలను గురువారం ఆయన కలెక్టరేట్లో ప్రారంభించారు. ప్రచార బ్యానర్స్ , పోస్టర్స్ ను ఆయన విడుదల చేశారు. రహదారి భద్రతా మాసోత్సవాలు ఈ నెల 16 నుండి ఫిబ్రవరి 15 వరకు నిర్వహింపబడతాయని వెల్లడించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.