ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి రెండు వారాల "మొబలైజేషన్" కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ టి. పి. విఠలేశ్వర్ సోమవారం ప్రారంభించారు. ఎస్పీ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలు పరిరక్షించడంలో ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది విధులు కీలకం వృత్తి నైపుణ్యం పెంపొందించుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు. వివిధ అంశాలను సమావేశంలో వివరించారు.