జిల్లా సంయుక్త కలెక్టర్ గా నియమితులైన ప్రఖార్ జైన్ సోమవారం తొలిసారిగా కలెక్టరేట్ కు చేరుకుని ఛార్జ్ తీసుకున్నారు. బాపట్లకు జేసీగా నియమితులైన వెంటనే ఆయన జిల్లాకు చేరుకున్నారు. అప్పటికే వరద విపత్తు నిర్వహణ ప్రకటించడంతో జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళిని కొల్లూరులో కలుసుకుని బాధ్యతలు చేపట్టారు. కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్ కు చేరుకున్న అనంతర ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరయ్యారు.