సీపీఐ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు అండగా ఉంటుందని సీపీఐ ఏరియా ఇన్‌చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు చెప్పారు. గురువారం చిలకలూరిపేట పట్టణంలోని 21, 25 వార్డుల పరిధిలోని పేదల నివేశన స్థలాల కోసం అర్జీలు స్వీకరించి, సచివాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.