చిలకలూరిపేట రహదారిపై బాధితులు నిరసన
చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంక్ లో జరిగిన నగదు కుంభకోణం పై బాధితులు శుక్రవారం జాతీయ రహదారి మీద నిరసనకు దిగారు. పోలీసులు బాధితులను చెదరగొట్టారు. ఆగ్రహావేశాలకు లోనవుతున్నా బాధితులకు భరోసా కల్పించటములో అధికారులు విఫలం అవుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. కుంభకోణానికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు.