నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చినపలకలూరులో శుక్రవారం 'వారథి' కార్యక్రమం జరిగింది. పోలీస్ సేవలు ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్సై సీహెచ్ వాసు పేర్కొన్నారు. 'మహిళలు, విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెట్టకూడదని, అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని సూచించారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు.