గుంటూరు: కాలువలో బాలుడి మృతదేహం
గుంటూరు నగరంలోని బుడంపాడు గ్రామం నీటి కాలువలో శనివారం పసికందు మృతదేహం నీటిలో కొట్టుకువచ్చినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు నల్లపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, నీటిలో నుంచి పసికందు మృతదేహాన్ని వెలికి తీశారు. నల్లపాడు ఏస్ఐ జగదీష్, పసికందుకు నెల వయసు ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి దర్యాప్తు జరుపుతామని పేర్కొన్నారు.