మంత్రి సత్య కుమార్ యాదవ్ డయేరియా బాధితులను పరామర్శించేందుకు శుక్రవారం దాచేపల్లికి వస్తున్నట్లు మండల టీడీపీ కన్వీనర్ బెల్లంకొండ బద్రి తెలిపారు. పల్నాడు కలెక్టర్ పి. అరుణ్ బాబు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో కలసి మంత్రి దాచేపల్లి టౌన్ నారాయణపురంలోని అంజనాపురం కాలనీలో డయేరియా ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారన్నారు. డయేరియాతో ఇద్దరు మృతి చెందగా వారి కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు.