దాచేపల్లి నగర పంచాయతీ మనసూర్ పేటలో సోమవారం వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. ఐదుగురు చిన్నారులను తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటనపై 14వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ షరీఫ్ సోమవారం మాట్లాడుతూ దాచేపల్లి నగర పంచాయతీ సిబ్బంది వెంటనే స్పందించి 48 గంటల్లో వీధి కుక్కల సమస్య పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఎవరికైనా ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత మున్సిపల్ అధికారులు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు.