రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని మతాలను గౌరవిస్తుందని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. ఆదివారం వినుకొండ పట్టణంలో జరిగిన నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం హిందూ, ముస్లిం, క్రిస్టియన్, హైందవ, సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యతను పూర్తిగా విస్మరించిందన్నారు. చివరకు ఆలయాల్లో రథాలను తగలబెట్టిన నిందితులపై కూడా చర్యలు తీసుకోలేదన్నారు.