పిడుగురాళ్ళ మండలం జూలకల్లు వద్ద సాగర్ కెనాల్ లో దూకి మనీషా అనే యువతి మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. మనీషా రేషన్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తుండగా, ఇటీవల స్థానిక టీడీపీ నాయకులు రేషన్ షాపు వదిలేయాలంటూ బెదిరించడంతో బలవన్మరణానికి పాల్పడింది. తన తండ్రి పేరు మీదున్న షాపు ఇవ్వడం ఇష్టంలేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.