రాజధానిలో నాబార్డ్ ఐకానిక్ భవనాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని నాబార్డు ఛైర్మన్ షాజీ కృష్ణన్ జీ హామీ ఇచ్చారు. తాడేపల్లి మండలం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. ఏపీకి ఆర్ఎడీఎఫ్ కింద అందించే అదనపు కేటాయింపులు, సహకార సంఘాలకు రాయితీలు మరింత అందిస్తామని కృష్ణన్ పేర్కొన్నారు. నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.