పంటల సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అన్నారు. మంగళవారం నరసరావుపేట మండలంలోని పమిడిపాడు గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళి జిల్లా ఉద్యన అధికారి రమణారెడ్డి, సైంటిస్ట్ నగేష్, ఏపిఎంఐపి పిడి ఆంజనేయులు, డిడిఏ శివకుమారి, డిపిఎం అమలకుమారి, ఏడిఎ మస్తానమ్మ, ఏఓ నరేంద్రబాబులతో కలిసి ప్రభుత్వం ప్రకటించిన ఎలుకలనివారణ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ పాల్గొన్నారు.