నరసరావుపేట మండలం ఎల్లమంద వద్ద ఈ నెల 31న పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, హెలిప్యాడ్, సభాస్థలిని పరిశీలించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట డీఎస్పీ, రూరల్ పోలీసులు పాల్గొన్నారు.