అక్రమంగా ఇసుకను డంప్ చేసి బ్లాక్ మార్కెట్లో అమ్మకం నిషేధమని అలా ఎవరైన అక్రమాల కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.మాదిపాడు వద్ద ఇసుక స్టాక్ పాయింట్ ను పరిశీలించి మాట్లాడారు. ఇసుక తరలింపులో అవకతవకలు లేకుండా సరైన కొలతలతో పైన టార్పాలిన్ తో కవర్ చేసి తరలించాలన్నారు. ఇసుక పాయింట్ల వద్ద ప్రత్యేక టీములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.