ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకొని పెదకూరపాడు ప్రభుత్వ ఆసుపత్రికి పది కుర్చీలను టిడిపి యువ నాయకులు గళ్ళ శివ సొంత నిధులతో శనివారం టిడిపి అధ్యక్షులు రమేష్ చేతుల మీదుగా అందించారు. మౌలిక వసతుల కల్పనకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ అన్నారు. దాతలు మరింత మంది ముందుకు వచ్చి ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.