పోలింగ్ పై అనుమానాలు పెరుగుతున్నాయి: అంబటి

54చూసినవారు
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ను వైసీపీ నేతలు మంగళవారం అమరావతి సచివాలయంలో కలిశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతంపై రోజురోజుకు అనుమానాలు పెరుగుతున్నాయని వాటిని నివృత్తి చేయాలని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలింగ్ శాతాన్ని ఈసీ మూడుసార్లు వేరువేరుగా వెల్లడించిందన్నారు. ఈ కార్యక్రమంలో లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగు నాగర్జున ఉన్నారు.

సంబంధిత పోస్ట్