బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఫేoగల్ తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో శుక్రవారం మోస్తారుగా వర్షం కురిసింది. దండమూడి, మామిళ్ళపల్లి, పెద్దపాలెం, ఆరెమండ తదితర గ్రామాలలో రైతులు వరి కోతలు సాగించి ధాన్యాన్ని ఆరబెట్టారు. వాయుగుండం తుఫానుగా మారితే తీవ్ర నష్టం చవిచూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవుడిపై భారము వేసి దిగాలు పడుతున్నారు