చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి వెంటనే జీవో విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి మురుగుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు మంగళవారం భట్టిప్రోలు లోని ప్రజాసంఘాల కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ఉచిత విద్యుత్ గురించి మూడుసార్లు ప్రకటించిందన్నారు. ప్రభుత్వం చేనేతలకు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు.