భట్టిప్రోలులో ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు
భట్టిప్రోలు లోని మాటూరు రామారావు శాఖ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను గురువారం ఘనంగా ప్రారంభించారు. బాలల దినోత్సవం, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని విద్యార్థులు క్రమం తప్పకుండా గ్రంథాలయాలకు వెళ్లి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని గ్రామ సర్పంచ్ ధారా రవి కిరణ్మయి అన్నారు.