కొల్లూరు: చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఆర్డీవో రామలక్ష్మి
కొల్లూరు మండలంలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను గురువారం ఆర్డీఓ రామలక్ష్మి తనిఖీ చేశారు. అరవింద వారధి, అనంతవరం, చిలుమూరు, వద్ద చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా కాకుండా చూడాలని అన్నారు. తనిఖీలలో కొల్లూరు తహసిల్దార్ వెంకటేశ్వర్లు, వేమూరు సిఐ ఆంజనేయులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.