బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా తెనాలి పట్టణాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెనాలి పట్టణంలో బహిరంగ మల, మూత్ర విసర్జనను నిషేధించినట్లు ప్రకటించారు. అందుకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై రూ. 500 జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. ప్రజలందరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఆయన సూచించారు.