తెనాలి: రేషన్ వాహనాల ఆకస్మిక తనిఖీ
ప్రజాపంపిణీ వ్యవస్థలో అవకతకవలను ఉపేక్షించేది లేదని తెనాలి తహశీల్దార్ కెవి. గోపాలకృష్ణ చెప్పారు. స్థానిక చినరావూరు, ఐతానగర్ ప్రాంతాల్లో ఎమ్డియూ వాహనాల్లో బియ్యం పంపిణీని ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చినరావూరులో 8వ నంబరు వాహనంలో రికార్డులు, స్టాకును తనిఖీ చేశారు. లబ్ధిదారుల వివరాలతో పోల్చి చూస్తే 450 కిలోల బియ్యం అదనంగా ఉన్నట్టు గుర్తించి నిర్వాహకులు కిరణ్‌ను నిలదీశారు.